calender_icon.png 17 April, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాలలో పోషన్ పక్వాడ్

08-04-2025 08:18:02 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాలలోని ఏసీసీ అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్ వైజర్ రమాదేవి హాజరై పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనత నివారణకు గర్భిణీలు ఆకుకూరలు కూరగాయలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ ఎన్. పద్మ, సహాయకురాలు లత, తదితరులు పాల్గొన్నారు.