calender_icon.png 23 January, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్... పిల్లలు

02-09-2024 04:57:07 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానానికి వెళ్లే రహదారిపై సోమవారం కురిసిన వర్షం ధాటికి గుంత పడి ప్రమాదకరంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన కన్నాల గ్రామానికి చెందిన కొంతమంది పిల్లలు రోడ్డుపై గుంత పడిన ప్రాంతానికి వెళ్లి రోడ్డు మీద వెళ్లే వాహనదారులను అప్రమత్తం చేస్తూ కనిపించారు. రోడ్డుపై గుంత పడింది.. పక్కనుండి వెళ్ళండి.. అంటూ చిన్నారులు ఆదిత్య, సుశాంత్, అజయ్, శ్రీకర్, మణి , ఆదిత్య లు వచ్చి పోయే భక్తులను అప్రమత్తం చేస్తూ గంటసేపు వర్షంలో అక్కడే ఉన్నారు. చిన్నతనంలోనే సామాజిక బాధ్యతతో ప్రమాదం జరగకుండా ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఈ చిన్నారులను చూసి ప్రతి ఒక్కరు శభాష్ అంటూ అభినందించారు.