హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10(విజయక్రాంతి): యూనివర్సి టీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కే మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఏఐఎస్‌ఎఫ్ ఓయూ కౌన్సిల్ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేండ్లుగా బీఆర్‌ఎస్ పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందన్నారు.
విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కానీ యూని వర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయకుండా అంతర్గత విషయాల్లో తలదూర్చొద్దని ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్ష కార్యదర్శులు లెనిన్, నెల్లి సత్య, నగర అధ్యక్ష కార్యదర్శులు చైతన్య, గ్యార నరేశ్ పాల్గొన్నారు.