calender_icon.png 5 December, 2024 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీపీఎస్సీకి 142 పోస్టులు మంజూరు

10-11-2024 01:39:43 AM

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ప్రభుత్వం పలు పోస్టులను మంజూరు చేసింది. 142 పోస్టులను కేటాయిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఇందులో ఉన్నాయి.

అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, ఎస్పీ, చీఫ్ అనలిస్ట్, అనలిటికల్ ఆఫీసర్, లా ఆఫీసర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, ప్రోగ్రామర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితర పోస్టులున్నాయి.

అయితే వీటిలో కొన్ని మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులుంటే మిగతావి డిప్యూటేషన్ పోస్టులున్నాయి. ఇదిలా ఉంటే టీజీపీఎస్సీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యంతోపాటు, ఉన్న కొంత మంది ఉద్యోగులపైనే ఒత్తిడి పడుతోంది. ఈక్రమంలోనే ఈ పోస్టులను సృష్టించారు.