ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ నేతల వినతి
హైదరాబాద్, అక్టోబర్ 26(విజయక్రాం తి): రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో సుమారు 5 వేల వరకు టీచింగ్, నాన్ టీచిం గ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి ఆర్‌ఎల్ మూర్తి, టీ నాగరా జు పేర్కొన్నారు. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో నూతన విద్యావిధా నం అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల పేద విద్యార్థులకు చదువు అందకుండా పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని కోర్సుల కౌన్సిలింగ్ తర్వాత కూడా సీట్లు పొందని విద్యార్థులున్నారని, వారు విద్యాసంవత్సరం నష్టపోకుం డా ప్రత్యేక దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు.
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసకొచ్చి బీ కేటగిరీ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందించిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎస్ రజనీకాంత్, డీ కిరణ్, ఆనగంటి వెంకటేశ్ తదితరులు ఉన్నారు.