calender_icon.png 11 January, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ వాయిదా

04-07-2024 12:45:57 AM

ప్రభుత్వ విజ్ఞప్తితో ఈ నెల 8కి..  

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఒక పార్టీ మ్యానిఫెస్టోపై గెలుపొంది, మరో పార్టీ కండువా కప్పుకొన్న ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ల విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది. వాయిదా వేయాలని ఏజీ సుదర్శన్‌రెడ్డి  కోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ విజయసేన్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మె ల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టులో  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ వేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది.