హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ -2 పరీక్ష వాయిదా పడ్డాయి. ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్షను డిసెంబర్‌కు ప్రభుత్వం వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా వేసినట్లు సమాచారం. కొత్త తేదీలని త్వరలోనే ప్రకటిస్తామని సర్కార్ తెలిపింది. గ్రూప్ - 2లో 783 పోస్టులకు 5.51 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ప్రభుత్వం అభ్యర్థులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పోస్టులు పెంచుతారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవరాం సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నారు. గ్రూప్-2 అభ్యర్థులతో ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్ చర్చిస్తున్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.