టీజీపీఎస్సీని కోరిన అభ్యర్థులు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ను 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. ఈ మేరకు శుక్రవారం టీజీపీఎస్సీ అధికారులను అభ్యర్థులు కలిసి వినతిపత్రం అందజేశారు. పలు అంశాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వాటిపై స్పష్టత వచ్చేంత వరకు పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తిచేశారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కీలో దొర్లిన తప్పులపై పలువురు అభ్యర్థులు న్యాయస్థానానికి ఆశ్రయించా రు. ఈ కేసులను మెయిన్స్ పరీక్ష నాటికి పరీక్షించాలని, లేనిపక్షంలో మెయిన్స్‌ను వాయిదా వేయాలని వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో అభ్యర్థులు వినోద్, సంపత్, చంద్రమౌలి తదితరులు ఉన్నారు.