ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు అభ్యర్థుల వినతి
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఎమ్మెల్సీ తీన్మానార్ మల్లన్నను పలువురు అభ్యర్థులు కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. తక్కువ సమయంలో డీఎస్సీకి తాము ప్రిపేర్ అవ్వలేమని, కనీసం నెల లేదా రెండు నెలల సమయమైనా ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తీన్మార్ మల్లన్నను కోరడంతో వెంటనే స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మూడు నెలలు డీఎస్సీని వాయిదా వేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.