calender_icon.png 18 January, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్ట్‌మ్యాన్

07-10-2024 12:00:00 AM

అక్టోబర్ 9 ‘ప్రపంచ తపాలా దినోత్సవం’ :

నీకు తెలియని వీధులు లేవు 

నీవు తిరగని రోడ్లూ ఉండవు 

నీ జాడకూడా కాస్త కరువైంది 

నీవు పిలిచే పిలుపుకూడా తగ్గింది 

నీ అడుగుల సవ్వడి లేక 

ఇప్పుడు వీధులన్నీ వెలవెల బోతున్నాయి

కొరియర్లు, అంతర్జాలాలు 

చరవాణీలు, యాప్‌లు 

ఎన్ని పోటీ పడుతున్నా 

ఎవ్వరు ఎదురు చూడక పోయినా 

కవులు మాత్రం నిరంతరం 

నీ కోసం ఎదురుచూస్తూ 

కలవరిస్తుంటారు.

రకరకాల రంగు కవర్లలో 

సంతోషాన్ని తెచ్చినా 

దుఃఖాన్ని మోసుకొచ్చినా 

తిరిగొచ్చిన కవిత్వం అయినా 

బహుమతి పొందిన కథ అయినా 

మనకి రావాల్సినవి 

వేరొకరికి చేరాల్సినవీ 

తుఫాను ప్రవాహంలో కూడా 

మోసుకొచ్చి తలుపు తట్టే నేస్తం నీవు! 

అనుకోని అతిథివి నీవు!!

 చిత్‌రాడ కిషోర్ కుమార్