22-12-2024 01:33:17 AM
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జేటీసీగా చంద్రశేఖర్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రవాణా శాఖలో పదోన్న తులు పొందిన అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీవోలకు డీటీసీలుగా.. డీటీసీలకు జేటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా డీటీసీలు, జేటీసీలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగులు ఇచ్చింది.
జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతి పొందిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా.. శివలింగయ్యకు అడ్మినిస్ట్రేషన్, ప్లానిం గ్, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్‌కు అదిలాబాద్ డీటీసీగా, ఎన్.వాణికి నల్గొండ డీటీసీగా, అఫ్రీన్ సిద్దిఖీకి కమిషనర్ కార్యాలయంలో డీటీసీగా, కిషన్‌కి మహబూబ్ నగర్ డీటీసీగా, సదానందంకు రంగారెడ్డి డీటీసీగా పోస్టింగులు ఇస్తూ రాష్ర్ట ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది.