04-03-2025 05:22:37 PM
గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఉత్తమ ఫలితాల సాధనకే వృత్యంతర శిక్షణ ఇవ్వడం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి(Tribal Welfare Department DD Ramadevi) అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా వందరోజుల ప్రణాళిక తయారుచేసి రోజువారి ప్రిపరేషన్, స్లిప్ టెస్ట్ పెడుతూ విద్యార్థులను సన్నద్ధం చేయడం జరుగుతుందన్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులు మానసికృతత్వం తో పాటు ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలుపరచాలని ఉపాద్యాయులను కోరారు. ఈ సమావేశంలో ఏసీ ఎం ఓ ఉద్దవ్, కోర్స్ డైరెక్టర్లు కృష్ణారావు ,రవీందర్, జిల్లా క్రీడా అధికారి మీనారెడ్డి, ఎటి డిఓ చిరంజీవి, రిసోర్స్ పర్సన్ లు సంతోష్, సాగర్, లాలాజీ తదితరులు పాల్గొన్నారు.