- కేజ్రీవాల్‌ను పెద్ద మోసగాడిగా అభివర్ణించిన బీజేపీ
కౌంటర్‌గా గోట్ పోస్టర్ విడుదల చేసిన ఆప్
న్యూఢిల్లీ, జనవరి 2: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడకముందే ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బుధవారం ఒకరిపై మరొకరు లేఖాస్త్రాలు సంధించుకుని పరస్పర ఆరోపణలు చేసుకున్న ఆప్, బీజేపీలు.. గురువారం సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేసి విమర్శలు గుప్పించుకున్నాయి. ముందు గా ‘స్కాం 2024’ టైటిల్‌తో కేజ్రీవాల్ ఫొటోతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసిన బీజేపీ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది.
కేజ్రీవాల్ ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాకుండా ఆయనను పెద్ద మోసగాడిగా అభివర్ణించింది. ఢిల్లీలో కేజ్రీవాల్ కొత్త ఆటను ప్రారంభించారని.. ఓట్లను రిగ్గింగ్ చేయడం ద్వారా అధికారాన్ని కాపాడుకునే ప్రతయ్నం చేస్తున్నారని విమర్శించింది. ఒకే ఇంటి చిరునామాపై వందల కొద్దీ నకిలీ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించింది.
ఆప్ కౌంటర్
కేజ్రీవాల్‌పై పోస్టర్‌ను విడుదల చేసిన కొద్ది సమయానికే బీజేపీకి ఆప్ కౌంటర్ ఇ చ్చింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన జీఓఏటీ(గోట్) పోస్టర్‌కు అరవింద్ కే జ్రీవాల్ ఫొటోను చేర్చి ఆయనను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా అభివర్ణించింది. ఆయన ఫొటో వెనక ఢిల్లీలోని ఆసుపత్రులు, పాఠశాలకు సంబంధించిన చిత్రాలను చేర్చు తూ వీడియోను రూపొందించి దాన్ని సో షల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆసుపత్రులు, పాఠశాలలు మెరుగైనట్టు వీడియో ద్వారా వెల్లడించిం ది.
ఓట్ల కొనుగోలు బీజేపీ పెద్ద మొత్తంలో డబ్బులు పంచుతోందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు బుధవా రం రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించా రు. ఆ లేఖపై కౌంటర్ ఇచ్చిన బీజేపీ.. సం ఘ్‌కు లేఖలు రాయడం మానకుని దాని నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని హిత వు పలికింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.