02-04-2025 12:00:00 AM
వారాసిగూడ, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమకారులకు తాము అండగా నిలుస్తామని, వారి సాధక బాధకాల పట్ల ఉద్యమ నాయకుడిగా తనకు పూర్తి అవగాహన ఉందని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశానుసారం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం ఉద్యమకారులకు 250 గజాల స్థలం 25 వేల పెన్షన్స్ సౌకర్యం తోపాటు సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండుతో ఏప్రిల్ 21న జరగబోయే ప్లీనరీ సమావేశ సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం మంగళవారం ఫో రం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లూరి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సితాఫలమండీలో జరిగింది.
కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు జానకి రెడ్డి, రాంబాబు ముదిరాజ్, దయానంద్ గంగాపుత్ర , జగన్ యాదవ్, ఆర్కే భూపాల్, లక్ష్మణ్, నరసింహ చారి, అమర్, సత్తన్న, నాగరాజు,శివ్ నేత, రాజేష్, లలిత, సరోజినీ తదితరులు పాల్గొన్నారు..