11-03-2025 08:24:59 PM
కోదాడ: మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో ప్రాచీన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు అధ్యయనోత్సవాలతో మంగళవారం ప్రారంభమయ్యాయి అని దేవాలయ చైర్మన్ అమరనాయిని వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కళ్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 18వ తేదీ వరకు జరుగుతాయన్నారు. సకల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాలయ కమిటీ చైర్మన్ అమరనాయుని వెంకటేశ్వరరావు తెలిపారు.
అర్చకులు ముడుంబ విష్ణువర్ధనఆచార్య, ముడుంబ లక్ష్మనాచార్యులు, రెంటాల పుల్లేశ్వరశర్మ, నందుల లక్ష్మీనరసింహశాస్త్రి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బుడిగం నాని, సొసైటీ డైరెక్టర్లు గుండపనేని ప్రభాకర్ రావు, కాసాని పుల్లయ్య, కమిటీ సభ్యులు కన్నెబోయిన సింగరయ్య, అమెరబోయిన ఉపేందర్, ఎర్రయ్య, బాలెబోయిన ఏడుకొండలు వేనేపల్లి నరసింహారావు, జడ వెంకటేష్, బాలెబోయిన ధనమూర్తి, యలమర్తి వెంకటనారాయణ, నాగార్జున, విక్కీ, కోటేష్ పాల్గొన్నారు.