calender_icon.png 25 February, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ సైన్స్ డే వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

24-02-2025 10:28:59 PM

ఎంఇఓ వెంకటేశ్వర్లు...

మునగాల: నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మునగాల విజ్ఞానోత్సవం నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన గోడపత్రికను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం- తెలంగాణ వ్యవస్థాపకులు గోళ్ళమూడి రమేష్ బాబుతో కలిసి ఆయన సోమవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. తధానంతరం ఆయన మాట్లాడుతూ... 25వ తేదీన మండల కేంద్రంలోని గంధం నర్సయ్య  విజ్ఞాన ప్రాంగణం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఈ సైన్స్ వేడుకలలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలతో పాటు, పర్యావరణ పరిరక్షణతో గీసిన డ్రాయింగ్స్ ప్రదర్శన, సైన్స్ సాంస్కృతిక ప్రదర్శనలు, కళారూపాలు, విజ్ఞానాత్మక అంశాల డాన్స్ లు తదితర అంశాల్లో పాల్గొనే విద్యార్థులను వెంట తీసుకొని ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు రావాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు కూడా అందిస్తున్నట్టు కన్వీనర్ శ్రీరామ్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, జ్యోతి, అంజన్ రెడ్డి, విద్యా భవాని, నాగమణి, సాజిదా బేగం తదితరులు పాల్గొన్నారు.