04-04-2025 12:00:00 AM
వనపర్తి టౌన్, ఏప్రిల్ 3: వనపర్తి జిల్లా వ్యాప్తంగా గంజాయి, కల్తీ కల్లు నిర్మూలనకు సంబంధించి అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు గురువారం రోజు వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు రూపొందించిన ‘గంజాయి & కల్తీ కల్లు నిర్మూలన‘ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నార్కోటిక్ బ్యూరో డిఎస్పీ మాట్లాడుతూ యువత మరియు ప్రజలు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.గంజాయి,కల్తీ కల్లు వంటి నిషేధిత పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజ పరం గా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎవరైనా గంజాయి విక్రయం లేదా కల్తీ కల్లు తయారీ, సరఫరా, వినియోగానికి పాల్పడినట్లు సమాచారం అందించిన వారి వివరాలు గో ప్యంగా వుంచబడును.
మత్తుమందుల వ్యసనాన్ని నిర్మూలించేందుకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డిఎ స్పీ, బుచ్చయ్య, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జగన్, వనపర్తి పట్టణ ఎస్త్స్ర, హరి ప్రసాద్, పోలీసు, తదితరులు పాల్గొన్నారు.