11-03-2025 11:07:59 PM
మహిళల హక్కుల సాధన కోసం ఉద్యమాలు ఉదృతం చేస్తాం.
ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి జ్యోతి..
మార్చి 21-23 తేదీల్లో మహిళా వికలాంగుల సంక్షేమం, సాధికారాతపై రాష్ట్ర సదస్సు..
33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరు..
మహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా అని, మహిళల హక్కుల సాధన కోసం ఉద్యమాలు ఉదృతం చేస్తామని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి జ్యోతి అన్నారు. ఈ రోజు NPRD రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా వికలాంగుల సంక్షేమo సాధికారత అంశంపై రాష్ట్ర సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... మహిళలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాన భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో మార్చి 8ని ఐక్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని అధికారికంగా జరుపుతున్నారని అన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. 10ఏండ్ల బీజేపీ పాలనలో మహిళలపై 28 శాతం నేరాలు పెరిగాయని అన్నారు. NCRB రిపోర్ట్ ప్రకారం మహిళలపై ప్రతి గంటకు 50 నేరాలు జరుగుతున్నాయని, 88 మంది మహిళలు మానభంగాలకు గురవుతున్నారని అన్నారు. బీజేపీ పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ కరువైన దేశాల్లో భారత దేశం ఒక్కటిగా తయారు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన 75మంది శిక్షల నుండి తప్పించుకుంటున్నారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేదని అన్నారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్నా అంశాలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్స్ అమలు చేస్థామని చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి మీనవేశాలు లెక్కిస్తుందని అన్నారు. మహిళాల హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.
NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది మహిళా వికలాంగులున్నారని అన్నారు. ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రంలో ఆర్టికల్ 3,6లలో మహిళా వికలాంగుల హక్కులు పొందుపార్చిన అమలుకు నోచుకోవడం లేదన్నారు. మహిళా వికలాంగుల్లో వివాహం కానీ వారి సంఖ్య సాధారణ మహిళలతో పోల్చితే 4రేట్లు అధికంగా ఉందని అన్నారు. 70శాతం మంది మానసిక వికలాంగులు లైంగిక దూరక్రమణకు గురవుతున్నారని అన్నారు. గృహ హింస చట్టంలోని సెక్షన్ 3(బి)(డి)మహిళా వికలాంగులు వినియోగించుకోవడం లేదన్నరు. మహిళా వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సదస్సుకు 33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. రాజు, సహాయ కార్యదర్శి జె. దశరథ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. శశికల, మహిళా నాయకులు దీపిక తదితరులు పాల్గొన్నారు.