22-03-2025 04:25:42 PM
ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): ఈ నెల 23 న భగత్ సింగ్ 94 వ వర్ధంతి సందర్బంగా కొమరారంలో కాగడాల ప్రదర్శన, సభని జయప్రదం చేయాలనీ కోరుతూ శనివారం ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామంలో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రచార పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంని ఉద్దేశించి పీవైఎల్ ఇల్లందు మండల సభ్యుడు కుంజా కిషోర్ మాట్లాడుతూ.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించిన భగత్ సింగ్ ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయాలనీ, డ్రగ్స్, ఫబ్, గంజాయి మత్తు పద్దర్ధాలకు యువత దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరణ్, అరవింద్, అఖిల్, శశి కుమార్, విజయ్, క్రిష్ణ, వినయ్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.