calender_icon.png 3 April, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఎంకు పోస్టు కార్డు

29-03-2025 12:00:00 AM

రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్

మనోహరాబాద్, మార్చి 28ః తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, దేశంలోనే తెలంగాణ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా 16 నెలలుగా సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాళ్లకల్ మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ అన్నారు.

శుక్రవారం రాష్ట్ర స్థాయి పోస్టు కార్డు ఉద్యమాన్ని కాళ్లకల్ పట్టణ కేంద్రంలో పోస్టాఫీసు దగ్గర ముఖ్యమంత్రికి పెండిగు బిల్లులు చెల్లించాలని పోస్టు కార్డు లు పంపారు. అనేక నిరసనలు, ఉద్యమాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి, సర్పంచులను పట్టించుకోక ఆర్థికం గా కుదేలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సర్పంచుల పెం డింగు బిల్లులు చెల్లించాలని  సర్పంచుల పోస్టుకార్డు ఉద్యమానికి రాష్ట్ర కార్యవర్గం శ్రీకారం చుట్టిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

శాంతి యుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను పోలీసులచే అణిచివేయడం తగదని అన్నా రు. అక్రమ అరెస్టులకు నిరసనగా పోస్టు కార్డు ద్వారా సర్పంచుల యొక్క గోస ముఖ్యమంత్రికి తెలియజేయడమే లక్ష్యంగా సర్పంచులందరూ పాల్గొన్నట్లు తెలిపారు.

ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి తెలంగాణ సర్పంచుల పెండింగు బిల్లులు వెంటనే విడుదల చేయలని డిమాండ్ చేశారు. లేనిప క్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.