- జైశంకర్ లావోస్ పర్యటన సందర్భంగా ఆవిష్కరణ
- ప్రపంచంలోనే మొదటి రామ్‌లల్లా స్టాంప్‌గా గుర్తింపు
న్యూఢిల్లీ, జూలై 27 : అయోధ్య బాలరాముడికి అరుదైన గౌరవం దక్కింది. విదేశాంగ మంత్రి జైశంకర్ లావోస్ పర్యటన సందర్భంగా రెండుదేశాలు సంయుక్తం గా అయోధ్య రాముడితో కూడిన పోస్టల్ స్టాంప్ సెట్‌ను ఆవిష్కరించాయి. శనివారం లావోస్‌లో జరిగిన ఆసియాన్ మెకానిజం సమావేశాలకు హాజరైన సందర్భంగా కేంద్ర జైశంకర్ ఈ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ సెట్‌ను విడుదల చేశారు. లావోస్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి సలీమ్‌క్సే కొమ్మాసిత్‌తో కలిసి పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు.
ప్రపంచంలోనే మొదటి రామ్‌లల్లా పోస్టల్ స్టాంప్‌గా ఇది గుర్తింపు దక్కించుకుంది. తాజాగా విడుదలైన ఈ స్టాంప్‌లో రెండు స్టాపులు ఉంటా యి. ఒకటి లావోస్ పురాతన రాజధాని లుయాంగ్ ప్రబాంగ్‌లోని బుద్ధుని విగ్రహాన్ని, మరొకటి అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని వర్ణిస్తుంది. ఇవి హైందవ, బౌద్ధమత జౌన్నత్యాన్ని, సాంస్కృతిక వారసత్వా న్ని వివరిస్తాయని జైశంకర్ తెలిపారు. అనంతరం మెకాంగ్ గంగా సహకారం కింద ఇరు దేశాల మధ్య 10 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులపై, డిజిటల్ సేవల్లో ఇరు దేశాల మధ్య సహకారంపై పలు ఒప్పందాలు జరిగాయి. మియంటియాన్‌లో తన మూడు రోజుల పర్యటన సందర్భంగా, జైశంకర్ లావోస్ ప్రధానితోనూ చర్చలు జరిపారు.