25-02-2025 01:48:57 AM
జిల్లా కలెక్టర్ సంగు వాన్
కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి కలెక్టరేట్ లో ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఏం.ఎల్.సి. ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి కలెక్టరేట్ లో ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఏం.ఎల్.సి. పట్టభద్రుల నియోజకవర్గం లో ఓటు హక్కు కలిగి ఉండి దరఖాస్తు చేసుకున్న వారు ఓటును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.