calender_icon.png 24 January, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడి ముసుగులో ప్రైవేట్ స్థలం కబ్జా..

23-01-2025 07:13:59 PM

విదేశాలకు వెళ్లొచ్చేసరికి కాలనీ వాసుల అత్యుత్సాహం..

ప్రైవేట్ స్థలంలో దేవుని గుడి కట్టి తమదే అని దౌర్జన్యం...

న్యాయం చేయాలంటూ వృద్ద దంపతుల ఆవేదన... 

మేడిపల్లి (విజయక్రాంతి): విదేశాలకు వెళ్లొచ్చేసరికి తమ సొంతస్థలంలో కొందరు కాలనీ వాసులు అత్యుత్సాహంతో దేవుని గుడిని నిర్మించి తమదే అంటు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వృద్దులు మీడియా ముందు వాపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... పిల్లల భవిష్యత్ కోసం పైస పైస కూడబెట్టి కొనుగోలు చేసిన స్థలాన్ని ఆక్రమించిది కాక తమ ప్లాట్ జోలికి వస్తే అంతుచూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు శోభ, ధనుంజయ బాయ్ లు ఆవేదన వ్యక్తం చేశారు. 

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల రెవెన్యూ సర్వే నెంబరు 76/6,76/7,76/8 లో 1978 లో భూ పట్టా దారులు లే అవుట్ చేసి అందులో నుండి దయానంద్ అనే వ్యక్తి జీపీఏ చేసుకుని ప్లాట్ నెంబరు 108 శోభకు, 109 ధనుంజయ బాయ్ లకు విక్రయించడం జరిగిందని, అయితే పిల్లల చదువుల కోసం భవిష్యత్తులో వారి పెండ్లిల ఖర్చుల కోసం పెట్టుబడిగా కొనుగోలు చేసిన వీళ్ళు వారి పిల్లలు విదేశాలలో ఉంటుండంతో అక్కడే పిల్లలతో కలిసి ఉంటున్నామని, ఈ క్రమంలో స్వదేశానికి వచ్చిన సందర్భంలో తమ ఇంటి స్థలాలు చూడగా స్థలంలో తాత్కాలిక షెడ్ వేసి ఉండడం చూసి ఇరుగు, పొరుగు వారిని అడగ్గా కాలనీకి చెందిన స్థలమని మీరు ఇక్కడ నుండి వెళ్ళి పోవాలని లేనిపక్షంలో మీ అంతు చూస్తామని కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు పూనుకుంటున్నారని పేర్కొన్నారు.

దీంతో చేసేదేమీ లేక సదరు వృద్ధ మహిళలు భూమి పట్టదారుల వారసులైన కొత్త నవీన్ యాదవ్ ను ఆశ్రయించి అతనికే ఏజీపీఏ చేశామని అన్నారు. దాంతో అతను సదరు స్థలం వద్దకు  వెళ్ళగా అతన్ని కూడా కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో చేసేదేమీ లేక జరిగిన విషయంపై మేడిపల్లి పోలీసులను ఆశ్రయించి, బెదిరింపులకు పాల్పడిన విషయం ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.