21-02-2025 10:53:40 PM
ఒరిస్సాకు చెందిన వ్యక్తి అరెస్ట్...
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నగరంలోని గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు శుక్రవారం పది కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు వాహనాల్లో గంజాయిని తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్టీఫ్ డీ టీమ్ పోలీసులు సీబీఎస్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి వస్తున్న ఉత్తమ్‌మండల్ అనే వ్యక్తి వద్ద 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.5లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. ఉపేందర్ మండల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు తెలిపారు. ఉత్తమ్‌మండల్, ఉపేందర్ మండల్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సోదాల్లో ఎస్సై జ్యోతి, సిబ్బంది అలీమ్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.