పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ పరిధిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఎండు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన దీపక్ కుమార్ బెహరా తాను నివాసం ఉంటున్న ఇంట్లో అక్రమంగా ఎండు గంజాయిని నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడు. ఎక్సైజ్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమచారాం మేరకు ఇస్నాపూర్‌లో ఇంటిపై దాడి చేసి 896 గ్రాముల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకొని దీపక్ కుమార్ బెహరాను కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.