ఎంపీ కొండా
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): సుప్రీం కోర్టుకు మించి వక్ఫ్ బోర్డుకు కాంగ్రెస్ పాలకులు అధికారాలిచ్చారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. విమర్శించారు. ఇప్పటికీ ఔరంగాజేబ్ విధానాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని వాపో యారు.
300 ఏళ్ల క్రితం ఔరంగజేబ్ నోటి మాటతో భూములిచ్చిండొ చ్చు, కానీ అనేక మంది నేడు వక్ఫ్ పేరిట కుప్పలుకుప్పలుగాడాక్యుమెంట్లతో భూములు తమవంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు వల్ల రైతు లు, సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. 1995 వక్ఫ్ చట్టం విధానాలు దేశాన్ని అమ్ముకునేలా ఉ న్నాయన్నారు. శీతాకాల సమావేశం లో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవుతుందని, ఆ తర్వాత వక్ఫ్ కష్టాలు తీరుతాయని తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదన్నారు.