04-03-2025 01:54:04 AM
ఎమ్మెల్యే డాక్టర్. చిట్టెం పర్ణిక రెడ్డి
నారాయణపేట. మార్చి 3 (విజయక్రాంతి) ః కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకోని రావడానికి ఎంతో కస్టపడి పనిచేసిన కార్యకర్తలకే పదవులు ఇస్తామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్. చిట్టెం. పర్ణిక రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోడిసీసీ అధ్యక్షులు కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి అధ్యక్షత న జిల్లా పంచాయతీ రాజ్ సంఘటన్ రివ్యూ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ర్ట పంచాయతీ రాజ్ సంఘటన్ అధ్యక్షులు రాచమల్లు సిద్దేశ్వర్ మరియు నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్. చిట్టెం. పర్ణిక రెడ్డి లు హాజరై మాట్లాడారు.గత ప్రజా వ్యతిరేక పాలన లో పార్టీ పరంగా కొట్లాడి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించాలని కొత్తగా వచ్చిన టిపిసిసి ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సూచించడం జరిగిందన్నారు.
వారి సూచన మేరకు ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగిందన్నారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందించాలని భావించి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఐదు అంచెల విధానాన్ని దేశ తట ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. కానీ గత పదేళ్లలో రాష్ర్టంలోని బీఆర్‌ఎస్, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకుండా గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురయ్యాయి అన్నారు.
టిఆర్‌ఎస్ బిజెపి పార్టీలు ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని అప్పుల కుప్పగా మార్చరన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని,ఆరు గ్యారెంటీ పథకాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కష్టపడ్డ వారికే టికెట్లు ఇచ్చి వారిని గెలిపించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, మద్దూర్ పిఎసిఎస్ చైర్మన్ జి నరసింహ,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రసన్నారెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు శివకుమార్, ఇలా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎండి గౌస్, వివిధ మండలాల అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎండి సలీం,జి. సుధాకర్ నరహరి, కోట్ల రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి,యూసఫ్ తాజ్, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.