calender_icon.png 17 April, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ పక్వాడ వారోత్సవాలు

08-04-2025 10:06:30 PM

కాటారం (విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల్లో పోషన్ పక్వాడ వారోత్సవాలలో భాగంగా పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహాదేవపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గంగారం సెక్టార్ కింద అల్లిపూర్ అంగన్వాడి కేంద్రంలో ముసుకుల శ్రీలత రెడ్డి, కాటారం, ప్రతాపగిరి, గారేపల్లి, నస్తరుపల్లి, మేడిపల్లి, బయ్యారం, గుమ్మల్లపల్లి, చిదేనేపెళ్లి, బస్వాపూర్, పోతుల వాయి, సుందరాజిపేట్ అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. చిన్న పిల్లలకు సమీకృత ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఇతర అవయవాలు సకాలంలో అభివృద్ధి చెందుతాయని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.