రూరల్ సీడీపీవో సూపర్వైజర్ రత్నమాల
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తల్లిపాలు బిడ్డకు ఔషధం లాంటివని రూరల్ సీడీపీఓ సూపర్ వైజర్ రత్నమాల అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలోని నవపేట్ మండల కేంద్రంలో పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బిడ్డకు సరియైన ఎదుగుదలకు సంబంధించి పోషకాలు సమృద్ధిగా అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రం ద్వారా ప్రతిరోజు చిన్నారులకు గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. సరైన సూచనలు సలహాలు కూడా అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ బాలింతలకు చిన్నారులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. వారం రోజులపాటు పోశం మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పోషకాల ప్రాముఖ్యతను గర్భిణీ బాలింతలకు చిన్నారులకు తెలియజేయాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చిన్నారులు, వారి తల్లులు ఉన్నారు.