27-02-2025 06:19:50 PM
అమరావతి,(విజయక్రాంతి): అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్(Obulavaripalli Police Station)లో వైఎస్ఆర్సీపీ నాయకుడు, ప్రముఖ సినీ నడుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని గురువారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు ఐదు గంటలుగా విచారిస్తున్నారు. ఆయన విచారణకు సహకరించడంలేదని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చొన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నాలకు ఆయన తికమక సమాధానాలు చెబెతూ.. తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అంటున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
పోసాని తరుపున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నమయ్య కోర్టుకు హాజరై బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం రైల్వే కోడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇవాళ పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పోసాని కృష్ణ మురళి అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పోసానిని చట్టప్రకారం అరెస్టు చేశారని, చట్టాన్ని గౌరవించకపోతే ఎవరినీ వదిలిపెట్టబోమని రవీంద్ర అభిప్రాయపడ్డారు.
వైఎస్ఆర్పీసీ అధికారంలో ఉన్న సమాయంలో ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై రెచ్చిపోయి, అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకున్నారు. దీంతో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం మై హోమ్ భుజాలో నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అదుపులోకి తీసుకొని, ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు తర్వాత, పోసానికి పోలీస్ స్టేషన్‌లో ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేవని డా.గురుమహేష్ స్పష్టం చేశారు.