calender_icon.png 23 January, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో పోర్చుగల్

03-07-2024 12:47:34 AM

  • స్లొవేనియాపై ఉత్కంఠ విజయం   
  • షూటౌట్‌లో సత్తాచాటిన రొనాల్డో

ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ): ప్రతిష్ఠాత్మక యూరోకప్‌లో పోర్చుగల్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ప్రిక్వార్టర్స్ పోరులో పోర్చుగల్ పెనాల్టీ షూటౌట్ (3 ద్వారా స్లోవేనియాపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన ఫ్రాన్స్‌తో పోర్చుగల్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ బ్లాక్‌బాస్టర్ మ్యాచ్ శనివారం జరగనుంది. పోర్చుగల్, స్లోవేనియా మధ్య పోరులో.. నిర్ణీత సమయం ముగిసే వరకు ఇరు జట్లు గోల్ కొట్టలేకపోయాయి. ఆటగాళ్లు పలుమార్లు గోల్‌పోస్ట్‌లపై దాడి చేసినప్పటికీ ఇరుజట్ల గోల్ కీపర్లు బంతిని అడ్డుకోవడంలో సఫలీకృతమయ్యారు. అదనపు సమయంలోనూ గోల్స్ రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.

షూటౌట్‌లో పోర్చుగల్ తరపున రొనాల్డో, బ్రూనో ఫెర్నాండెస్, బెర్నార్డో సిల్వాలు గోల్స్ కొట్టగా.. పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా అడ్డుగోడలా నిలబడడంతో స్లోవేనియా బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టడంలో విఫలమైంది. యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన ఈ టోర్నీలో ఇప్పటి వరకు 14 గోల్స్ బాదిన పోర్చుగల్ స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో.. ఇదే తనకు చివరి యూరోకప్ అని ప్రకటించాడు.

దేశం కోసం ఈ సారి కప్పు గెలవాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌తో పోరు గురించి పెద్దగా ఆలోచించడం లేదని ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగుతామని వెల్లడించాడు. ఇక మరో మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1 బెల్జియంపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఫ్రాన్స్ తరపున జాన్ వెర్టోన్‌గెన్ గోల్ సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్‌తో జర్మనీ, ఇంగ్లండ్‌తో స్విట్జర్లాండ్ తలపడనున్నాయి.