calender_icon.png 30 January, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ అంబేద్కర్, నరేంద్ర మోదీ చిత్రపటాలకు క్షీరాభిషేకం

29-01-2025 12:09:17 AM

యాదాద్రి భువనగిరి, జనవరి 28 (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల అశోక్, జిల్లా పార్టీ అధ్యక్షులు పాశం భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలు.

30 ఏళ్లుగా తమ జాతి రిజర్వేషన్లు వర్గీకరణ కోసం పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చందుపట్ల వెంకటేశ్వరరావు, నర్ల నర్సింగ్ రావు మున్సిపల్ వైస్ చైర్మన్ మాయదశ, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి,

జిల్లా ఉపాధ్యక్షులు పట్నం శ్రీను, జేనపల్లి శ్యాంసుందర్ రెడ్డి, వైజయంతి, ఉడుత భాస్కర్, సుర్వి శ్రీనివాస్ గౌడ్ , దళిత మోర్చా ప్రతినిధి మేడి కోటేష్, జిల్లా అధికార ప్రతినిధి నీలం రమేష్, మాజీ కౌన్సిలర్లు నల్ల మాస సుమ, జనగాం నరసింహ చారి, సురేష్ రెడ్డి, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి కృష్ణాచారి, రత్నపురం శ్రీశైలం, యాట వెంకట్, రాము నాగరాజు, రమేష్, మల్లికార్జున్, కొండల్, ఎండి మహమూద్, కొల్లోజు సతీష్, బాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.