భీమదేవరపల్లి,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో హమాలీ కార్మికులు ధర్నా చేశారు. తమ న్యాయమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, స్వామి, సంపత్,రాజు, శ్రీనివాస్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.