calender_icon.png 27 December, 2024 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనలో జనగణన చేయాలి

27-12-2024 03:37:59 AM

  1. బెల్గాం సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన 
  2. ఏకగ్రీవంగా ఆమోదించిన సీడబ్ల్యూసీ
  3. మహిళా బిల్లును తీసుకొచ్చింది మనమే.. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయనున్న జనగణనలో దేశవ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అయన సూచించగా, ఈ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

కర్ణాకటలోని బెల్గాంలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దేశంలో త్వరలో పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల పెంపు తక్కువగా ఉండి.. నష్టపోయే పరిస్థితి ఉంటుందని, ఈ విషయంలో  ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలని కోరారు. 

నియోజక వర్గాల సంఖ్య పెం పు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు. చట్ట సభలలో మహిళ బిల్లు ను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశ పెట్టి ఒక కొలిక్కి తెచ్చిన నేపథ్యంలో ఆ బిల్లుపై ఎక్కవగా ప్రచారం చేయాలన్నారు. 

బీజేపీ మహిళ బిల్లుతో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని ఆ విషయంలో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం పేర్కొన్నారు.  కులగణనతో  తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మార్గదర్శిగా ఉందన్నారు. 

కులగణనతో విప్లవాత్మకమైన మార్పులు: పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

వంద ఏళ్ల క్రితం ఇదే బెల్గాంలో మహా త్మాగాంధీని సీడబ్ల్యూసీ ఏఐసీసీ అధ్యక్షుడి గా ఎన్నుకున్నదని తర్వాత ఆయన ఏ పద వి చేపట్టకున్నా  కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఆనుసరిస్తారని పీసీసీ అధ్యక్షు డు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.  అం దుకు ఆయన చెప్పిన సిద్ధాంతాలు, విధానాలే కారణమన్నారు. 

రాహుల్ గాంధీ ఆలోచనలతో చేపట్టాలని నిర్ణయించిన కులగణనతో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని,  ఇది దేశమంతా స్వాగతించాల్సిన అంశమన్నారు. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశా న్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిదని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభించిందని, తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.  ఇప్పటికే 90 శాతం కులగణన పూర్తయిందని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని, చరిత్రను తిరగరాయాలని చూస్తు న్నదని ఇలాంటి తరుణంలో దేశానికి సేవలు, త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్రకారుల, త్యాగ పురుషుల జీవితాలను నేటి తరానికి వివరించాలని సూచించారు. 

సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరైయేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్,  డిప్యూటీ సీఎం భట్టి, సీడబ్ల్యూసీ సభ్యులు, మంత్రు లు  రాజనరసింహ, ఉత్తమ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి,  ఏఐసీసీ నాయకులు వంశీచందర్‌రెడ్డి గురువారం బేగంపేట  నుంచి  ప్రత్యేక విమానంలో బెల్గాం వెళ్లారు.