calender_icon.png 22 April, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

22-04-2025 01:07:21 AM

  1. అనారోగ్య సమస్యలతో వాటికన్‌సిటీలో మృతి
  2. శోకసంద్రంలో 1.4 బిలియన్ల కేథలిక్ ప్రజలు
  3. పోప్ మరణం తీవ్రంగా బాధించింది: ప్రధాని మోదీ
  4. శాంతిదూతగా ప్రపంచంపై చెరగని ముద్ర: సీఎం రేవంత్‌రెడ్డి
  5. ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల 

కేథలిక్ ప్రజల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఇక లేరు. వాటికన్ సిటీలోని సెయింట్ మార్తా రెసిడెన్సీలోని తన అపార్ట్‌మెంట్‌లో ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35 గంటలకు ఆయన కన్నుమూశారు. ఫ్రాన్సిస్ గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 14న ఆయన ఆసుపత్రిలో చేరి 38 రోజులపాటు చికిత్సపొంది క్రమంగా కోలుకున్నారు.

ఈస్టర్ పర్వదినం సందర్భంగా ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ ఈస్టర్’ అంటూ భక్తులకు పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా శుభాంకాక్షలు తెలిపారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచినట్టు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. పోప్ మరణవార్తతో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోప్ ఫ్రాన్సిస్ పార్థీవదేహాన్ని 4 తర్వాత కేథలిక్‌ల ఆచారాల ప్రకారం ఖననం చేయనున్నారు. కరుణ, మానవత్వం, ఆధ్యాత్మికత, ధైర్యానికి ప్రతీకగా ఆయన గుర్తుండిపోతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాంతి దూతగా ప్రపంచంపై పోప్ ఫ్రాన్సిస్ చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు.

పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు

  1. వాటికన్ సీటీలోని స్వగృహంలో కన్నుమూత
  2. సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో ఖననానికి ఏర్పాట్లు!
  3. దక్షిణ అమెరికా నుంచి పోప్ పదవి చేపట్టిన తొలి వ్యక్తి 
  4. పోప్ ఫ్రాన్సిస్ మరణం తీవ్రంగా బాధించింది: ప్రధాని 
  5. శాంతి దూతగా ప్రపంచంపై చెరగని ముద్రవేశారు: సీఎం రేవంత్‌రెడ్డి

వాటికన్ సిటీ, ఏప్రిల్ 21: కేథలిక్ ప్రజల ఆరాధ్య మత గురువు పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. డబుల్ న్యుమోనియా నుంచి కోలుకుని కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఫ్రాన్సిస్.. వాటికన్ సిటీలోని సెయింట్ మార్తా రెసిడెన్సీలో గల తన అపార్ట్‌మెంట్‌లో ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఫ్రాన్సిస్ మరణవార్తను వీడి యో సందేశం ద్వారా వాటికన్ వర్గాలు వెల్లడించాయి. ఫ్రాన్సిస్ మరణవార్తతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1.4 బిలియన్ల కేథలిక్ ప్రజలను విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ప్రపంచ నేతలు ఫ్రాన్సిస్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. 

ప్రపంచానికి ఫ్రాన్సిస్ చివరి సందేశం ఇదే..

మృతి చెందడానికి కొన్ని గంటల ముందు ప్రపంచానికి పోప్ ఫ్రాన్సిస్ తన చివరి సందేశాన్ని ఇచ్చారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరిం చుకుని మరణం కోసం కాదు జీవించడానికి మనల్ని భగవంతుడు సృష్టించాడంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రపంచానికి తన సందేశం పంపారు. పోప్ ఫ్రాన్స్ గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ నిమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14 నుంచి 38 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఈస్టర్ సందర్భంగా తొలిసారి ఆయన ప్రజల ముందుకు వచ్చారు. వాటికన్ నగరంలోని పీటర్స్ స్కేర్‌లో దాదాపు 35వేల మందిని ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ‘నా సోదర సోదరీమణులారా.. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’ అని పోప్ స్వయంగా చెప్పారు.

అనంత రం ఆయన సందేశాన్ని ఆర్చి బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్‌లలో శాంతి నెలకొనాలని ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య ఆయన ప్రయాణించారు. ఈ క్రమంలోనే కొంత మంది పసికందులు, చిన్నారులకు ఆశీర్వాదం అందించారు. 

ఇలా పదవి చేపట్టిన మొదటి వ్యక్తి ఫ్రాన్సిసే

ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటినాలో జన్మించా రు. ఆయన తన 12వ ఏట నుంచే చర్చి, సమా జం అంటూ అట్టడుగు వర్గాల కోసం అంకితమై పని చేశారు. ఈ క్రమంలోనే పోప్ బెనిడె క్ట్ తర్వాత పోప్‌గా ఫ్రాన్సిస్ 2013లో బాధ్యతలు చేపట్టారు. 266వ పోప్‌గా ఎన్నికై.. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ చరిత్రలో నిలిచిపోయారు. 

వాటికన్ మార్పునకు కృషి

వాటికన్ ఆర్థిక వ్యవస్థ, పాలనను సంస్కరించడంలో పోప్ ఫ్రాన్సిస్ కీలకంగా వ్యవహరిం చారు. మతపరమైన సంప్రదాయాలు అనుసరిస్తూనే సమాజానికి ఉపయోగపడే అనేక విష యాలను అనుసరించారు. పర్యవరణ పరిరక్షణ, అణు యుద్ధాలపై వ్యతిరేకత, శాంతియుత జీ వన విధానంపై ఆయన చేసిన ప్రచారం అనేక మందికి మార్గదర్శకం అయింది. చర్చిల్లో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పోప్ పేర్కొన్నారు. 2016 లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలను ఫ్రాన్సిస్ కడిగారు.  

సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో ఖననం

పోప్ మరణవార్తను ధ్రువీకరించిన వెంట నే.. వాటికన్ అధికారులు ఆయన మరణాన్ని నిర్ధారించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ బాధ్యత సాధారణంగా వాటికన్ ఆరోగ్యశాఖ, కామెర్లేంగోపై ఉంటుంది. తాత్కాలిక కెమెరామనో కార్డినల్ కెవిన్ జోసెఫ్ ఫారెల్ ఈ ఏర్పా ట్లను పర్యవేక్షించనున్నారు. సంప్రదాయం ప్ర కారం మరణించిన కొన్ని రోజుల తర్వాత పో ప్‌ల పార్థీవదేహాలను ఖననం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే పోప్ ఫ్రాన్సిస్ మృతదేహాన్ని 4 రోజుల తర్వాత ఖననం చేయనున్నారు. పురాతన సంప్రదాయం ప్రకారం పోప్‌లు వ్యక్తిగత ప్రార్థన కోసం తరచూ వెళ్లే చర్చి ప్రాంగణాల్లో వారి మృతదేహాలను ఖననం చేస్తారు. పోప్ ఫ్రాన్సిస్ తరచూ వెళ్లే సెయింట్ మేరీ మేజర్ బలిసికా చర్చిలో ఆయన మృతదేహాన్ని ఖననం చేయనున్నారు. 

పోప్ ఎన్నిక విధానం ఇలా..

పోప్ మృతి నేపథ్యంలో తదుపరి పోప్ ఎవరు? అనే చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. ఫ్రాన్సిస్ వారసత్వం కోసం పోటీపడుతున్న వారిలో వాటికన్ సిటీ విదేశాంగ మంత్రి కార్డినల్ పీట్రో పారోలిన్, ఐరోపా బిషప్స్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు పీటర్ ఎర్డో, కార్డినల్ పీటర్ టురుక్సన్, కార్డినల్ లూయీస్ టాగ్లో, కార్డినల్ మాట్టో జూప్పీ, కార్డినల్ రేమాండ్‌లియో బుర్కె పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

పోప్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జరిగే ముఖ్యమైన ఘట్టం పాపల్ కాన్క్లేవ్. ఈ కాన్క్లేవ్ సాధారణంగా పోప్ మరణించిన 15 రోజుల తర్వాత జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చర్చిని తాత్కాలికంగా పర్యవేక్షించే కాలేజ్ ఆఫ్ కార్డినల్స్, కొత్త పోప్‌ను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంది. 2025 జనవరిలో రూపొందించిన నిబంధనల ప్రకారం కేవలం 80 లోపు వయసు ఉన్న కార్డినల్స్ మాత్రమే పోప్ ఎంపిక రహస్య ఓటింగ్‌లో పాల్గొంటారు.

ఈ క్రమంలో 252 కార్డినల్స్‌లో కేవలం 138 మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ సిస్టీన్ చాపెల్‌లో జరుగుతుంది. ఓటింగ్‌లో పాల్గొనే కార్డినల్ ఓటింగ్ సమయంలో చర్చించిన అంశాలను రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. రోజువారీ నాలుగు రౌండ్ల చొప్పున ఎవరైనా ఒక అభ్యర్థికి మూడింట రెండొంతుల మెజార్టీ లభించే వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు మొత్తం 15 రోజుల సమయం పట్టొచ్చు. 

ప్రముఖుల సంతాపం

పోప్ మరణం తీవ్రంగా బాధించిం ది. కేథలిక్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి. కరుణ, మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా ఆయన గుర్తుండిపోతారు. చిన్నవయసు నుంచే క్రీస్తు ఆశ యాల కోసం పని చేశారు. విధి వంచితుల కోసం సేవలు చేశారు. ఆయనతో సమావేశమైన సందర్భాలను  గుర్తుంచుకుంటాను. సమ్మిళిత అభివృద్ధి విష యంలో ఆయన చూపిన నిబద్ధత నన్ను ప్రభావితం చేసింది. 

 ప్రధాని నరేంద్రమోదీ

* ఆయన్ను ఇటీవల కలిశాను. కొవిడ్ తొలినాళ్లలో పోప్ ప్రసంగాలు మర్చిపోలేను. అవి చాలా అద్భుతమైనవి.

 జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు

* పోప్ మృతి మానవాళికి తీరని లో టు. తన జీవితాన్ని చర్చి, మానవాళి సే వకు అంకితం చేశారు. సామాజిక న్యా యం కోసం అవిశ్రాంత కృషి చేశారు. ప్రపంచ శాంతి స్థాపకుడిగా పోప్ పాత్ర అద్భుతం.

 రేవంత్‌రెడ్డి, తెలంగాణ సీఎం

* పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచ శాంతికి తీరని లోటు. ప్రేమాభిమానాలతో, సుఖ శాంతులతో, విశ్వ మానవా ళి జీవించాలని జీసస్ క్రీస్తు బాటలో నడిచిన పోప్ మరణం కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 

 అధినేత కేసీఆర్

* పోప్ అసంఖ్యాక ప్రజానీకానికి మార్గదర్శకులు. ఆధ్యాత్మిక సేవలో పోప్ అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆయన మరణం దిగ్భ్రాంతికరం

 మంత్రి జూపల్లి కృష్ణారావు