calender_icon.png 27 October, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔషధాల్లో నాణ్యతాలోపం

27-10-2024 12:48:39 AM

లిస్టులో విటమిన్ D3, కాల్షియం ట్యాబ్లెట్స్

క్వాలిటీ ప్రమాణాలు లేని 49 ఔషధాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశంలోని 49 ఔషధాలు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎఫ్‌సీఓ) నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయి. ఈ 49 ఉత్పత్తుల్లో లైఫ్ మ్యాక్స్ ల్యాబొరేటరీస్ తయారుచేస్తున్న కాల్షియం 500తోపాటు విటమిన్ డీ3 ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి. దేశంలోని అత్యధిక మంది ప్రజలు నిత్యం వీటిని తీసుకుం టూ ఉంటారు. ఈ విషయాన్ని సీడీఎఫ్‌సీఓ నెలవారీ రిపోర్టుల్లో వెల్లడించింది. 3000 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు జరపగా అం దులో 49 ఉత్పత్తులు నిర్ధారిత ప్రమాణాలను అందుకోలేకపోయినట్లు గుర్తించామం ది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నాణ్యత ప్రమాణాల్లో విఫలమైన ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించినట్లు పేర్కొంది. కర్ణాటక యాంటిబయోటిక్స్ కంపెనీకి సంబంధి ంచిన పారాసిటమల్, ఆల్కెమ్ ల్యాబ్స్‌లో తయారవుతున్న పాన్ నాణ్యతా పరీక్షల్లో విఫలమైనట్లు వివరించింది.