calender_icon.png 22 December, 2024 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మేముసైతం

11-09-2024 08:35:32 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని యాపల్ గాంధీ బొమ్మ ప్రాంతంలో నివాసముండే నిరుపేద ప్రయివేటు డ్రైవర్ పరమేష్ అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో దహన సంస్కారాలు నిర్వహించలేని నిరుపేద కుటుంబానికి పట్టణంలోని మేముసైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు మేమున్నామని ముందుకు వచ్చి అంత్యక్రియల నిర్వహణకు ఆర్థికసాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద ఆటో డ్రైవర్ అనారోగ్యంతో మృతిచెందగా దహన సంస్కారాలు నిర్వహించలేని పరిస్థితిని తెలుసుకున్న సంస్థ సభ్యులు దాతల సహకారంతో సేకరించిన 6100 రూపాయలను బాధిత కుటుంబానికి మంగళవారం అందించారు.కాగా మృతునికి భార్య ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు బూబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ తినడానికి కూడా ఆర్థిక స్తోమత లేని కడు నిరుపేద కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు తుర్లపాటి సోమయ్య లు పాల్గొన్నారు.