calender_icon.png 2 April, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

01-04-2025 04:26:50 PM

ఎమ్మెల్యే కోవలక్ష్మి...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం అందజేస్తున్న సన్నబియ్యాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హాడ్కోకాలనీ రేషన్ షాప్ వద్ద ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం దళారులకు విక్రయించకూడదని వాడుకోవాలని తెలిపారు. బియ్యం అక్రమ రవాణా జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రోహిత్, డిప్యూటీ తహసిల్దార్ పోచ్చయ్య, రేషన్ డీలర్ అసోసియేషన్ సంఘం నాయకులు రేగుంట కేశవరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.