calender_icon.png 22 April, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలకు మేలు

21-04-2025 12:01:12 AM

 నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఖమ్మం, ఏప్రిల్ 20( విజయక్రాంతి ):- వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అమలుతో పేద ముస్లీంలు ముఖ్యంగా మైనార్టీ మహిళకు ఎంతో మేలు చేకూరుతుందని, పాత వక్ఫ్బోర్డు అమలు అంటే చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే చందంగానే ఉంటుందని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ గౌడ్, హైకోర్టు న్యాయవాది, బీజేపీ రాష్ట్ర నాయకులు సుంకర మౌనిక అన్నారు.

వక్ఫ్ చట్ట సవరణ 2025 జన జాగరణ అభియాన్ పేరుతో ఖమ్మం నగరంలోని హోటల్ మినార్ గ్రాండ్లో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన,   కన్వీనర్ ఇవి.రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అతిధులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.

తొలుత నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ తమిళనాడు, కర్నాటక సహ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి వక్ఫ్బోర్డు సవరణ చట్టం వలన ముస్లీం మైనార్టీలకు వనగూరే ఉపయోగాలు, పకడ్బందీగా అమలు కాకపోతే వచ్చే నష్టాలను గురించి చరవాణిలో తన సందేశం ద్వారా తెలిపారు. 

ఈ సందర్భంగా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రానికి మేమే కారణం అని జబ్బలు చరుచుకునే కాంగ్రెస్ నేతలు, వారికి వత్తాసు పాడుతూ పబ్బం గడుపుకునే కమ్యూనిస్టు పార్టీలు, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ తొత్తు పార్టీ అయిన బీఆర్‌ఎస్లు కలిసి వక్ఫ్ చట్ట సవరణ గురించి ముస్లిం మైనార్టీలను భయాందోళనలకు గురి చేస్తూ దేశాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

వందలో 70శాతం మందికి అన్యాయం జరిగితే కేవలం ధనిక ముస్లింలకు మాత్రమే మేలు జరిగేదని వివరించారు.వక్ఫ్బోర్డు వలన ముస్లీంలకు అన్యాయం తప్ప ఉపయోగం ఏమాత్రమూ లేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు, వారిని ఛైతన్యపరిచేందుకు బీజేపీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం హైకోర్టు అడ్వకేట్ మౌనిక సుంకర, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్గౌడ్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు అమలైన వక్ఫ్బోర్డు చట్టంతో పేద, మధ్యతరగతి ముస్లీంలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు నున్నా రవి కుమార్, నంబూరి రామలింగేశ్వరరావు,  విజయరాజు , కన్వీనర్ ఇవి.రమేష్, కోౠకన్వీనర్లు వీరవెల్లి రాజేష్ గుప్తా, కొలిపాక శ్రీదేవి, ఎస్కె.యాకూబ్ పాషా, పమ్మి అనిత తదితరులు పాల్గొన్నారు.