23-04-2025 12:37:36 AM
వికారాబాద్, ఏప్రిల్-22: మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో టెమ్రీస్(తెలంగాణ బాలికల మైనారిటీ కళాశాల, శివా రెడ్డిపేట్ )విద్యార్థి అఫ్షా తరన్నుమ్ 907 మార్కులతో సత్తా చాటింది, తండ్రి మొహమ్మద్ సలీం పెయింటర్, తల్లి గృహిణి. పేదింటి బిడ్డ ప్రభుత్వ కళాశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల తల్లి దం డ్రులు సంతోషం వ్యక్తపరిచారు. ఇటీవలే జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో తమ కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుదడిగా ఎంపికవ్వడం,ఇప్పుడు కూతురు కూడా మంచి ఫలితం సాధించడంతో వారి ఆనం దం రెట్టింపు అయ్యింది.
డాక్టర్ అయ్యి పేదలకు సేవ చేస్తా డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న దాతల సహకారంతో పై చదువులకు వెళ్తా, ఎం. బి. బి. ఎస్. చేసి డాక్టర్ అయి పేదలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం, ఇంటి వారి పూర్తి సహకారం ఉంది.
అఫ్షా తరన్నుమ్