calender_icon.png 9 October, 2024 | 3:53 PM

పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్‌.. ఆ డైరెక్టర్ కెరీర్ నాశనం చేశాడంటూ వ్యాఖ్యలు

09-10-2024 01:07:36 PM

హైదరాబాద్: పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారి దుమారం రేపుతోంది. సినీ పరిశ్రమలో ఓ డైరెక్టర్ ఓ యువతిని గర్బవతిని చేసి, తర్వాత అబార్షన్ చేయించాడని, దీంతో నటి జీవితం నాశనం అయిందంటూ ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. ఆ పంజాబీ నటికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అండగా నిలబడిందని చెప్పింది. దాంతో కాస్త సహాయం దొరికిందని తెలిపింది. అతను రాజకీయ నాయకుడిగా మారిన యాక్టర్ కాదని వెల్లడించింది. కాగా, ఈ విషయంలో తనను, ఆ నేతను అనవసరంగా లాగారని పూనమ్ స్పష్టం చేసింది. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన ఆరోపణలు చేసిన పూనమ్ కౌర్ ఎక్స్ లో చేసిన ఈ పోస్టులో ఎవరి పేర్లను ప్రస్తావించలేదు.