28-02-2025 02:17:10 AM
బాన్సువాడ ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని శ్రీ శ్రీ శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహా శివరాత్రి ఉపవాస దీక్ష విరమణ లో భాగంగా గురువారం పోచారం శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యులు ఉపవాస దీక్షను విరమణ చేశారు. అనంతరం ప్రతి ఏటా పోచారం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసేటువంటి మహ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భక్తులకు స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు పోచారం శంభు రెడ్డి , పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కోటగిరి మండలం కారేగావ్ గ్రామంలో మహ శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి 11 వ అఖండ శివనామ సప్తహా కార్యక్రమంలో పాల్గొని శివలింగాన్ని దర్శించుకుని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.