- నకిలీ ధృవీకరణ పత్రాలు, తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దర్యాప్తులో వెల్లడి
- కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
న్యూ ఢిల్లీ, జూలై 19: వివాదాస్ప ద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ కఠిన చర్యలకు ఉపక్ర మించింది. ఆమె ఐఏఎస్ ఉద్యోగా న్ని రద్దు చేసేందుకు నోటీసులు జా రీ చేసింది. నకిలీ వైకల్య ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ అనంతరం ని జమని తేలడంతో ఆమె అభ్యర్థిత్వా న్ని రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసి ంది. పూజ తండ్రికి మధ్యంతర బెయిల్ లభించింది. యూపీఎస్సీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై పూజ స్పందిస్తూ.. న్యాయవ్యవస్థ త నపని తాను చేసుకుపోతుంది అన్నారు.