28-02-2025 12:00:00 AM
రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమిర్ ఖాన్, నాగార్జున కూడా భాగమయ్యారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోందంటూ కొద్ది రోజులుగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో పూజా సైతం భాగమైందని వెల్లడించారు.
ఇటీవల ఓ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసి దానిలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తించాలంటూ చిత్ర యూనిట్ పోస్ట్ పెట్టింది. దానిని చూసిన అభిమానులు అది పూజాదేనంటూ కన్ఫర్మ్ చేశారు. తాజాగా మేకర్స్ సైతం ఆ ప్రీ లుక్ పోస్టర్ పూజాదేనని తేల్చేశారు. అయితే ఈ చిత్రంలో పూజా పాత్ర ఏంటనేది తెలియరాలేదు.
కొందరేమో కీలక పాత్ర పోషిస్తోందని అంటుంటే.. మరికొందరు స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేస్తుందని అంటున్నారు. పూజా కోసం ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా..’ తరహాలో ఒక పాటను సైతం ప్లాన్ చేశారని అభిమానులు అంటున్నారు. ఇక బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.