calender_icon.png 8 October, 2024 | 10:02 AM

ఆఖరి సినిమాకు పూజ

05-10-2024 12:00:00 AM

విజయ్ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. ‘దళపతి69’ ప్రచార టైటిల్‌తో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్న కేవీయన్ ప్రొడక్షన్స్ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది. సినిమాలో నటించే తారాగణం, సాంకేతిక నిపుణుల సమక్షంలో పూజ జరగ్గా, శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది.

బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తారు. గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రియమణి, ప్రకాశ్‌రాజ్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం సమకూర్చుతుండగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీలో 2025 అక్టోబర్‌లో విడుదల కానుంది.