calender_icon.png 29 December, 2024 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోంజీ స్కామ్ నిందితుడి అరెస్ట్

29-12-2024 01:16:37 AM

అహ్మదాబాద్, డిసెంబర్ 28:  అధిక వడ్డీ పేరుతో రూ. 6 వేల కోట్లను ప్రజల నుంచి వసూలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనాన్షియల్ సర్వీస్ బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్రసింగ్ ఝలా తమ సంస్థ ద్వారా బ్యాంకుల కంటే  అధికి వడ్డీ ఇస్తామని గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాడు.

అయితే కొన్ని రోజుల తరువాత అనుమానం రావడంతో మూడు నెలల క్రితం సీఐడీ అధికారులకు కొ ందరు  ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పోంజీ స్కాం వెలుగులోకి వచ్చింది. సంస్థకు చెందిన గాంధీనగర్, ఆరావాళి, సబర్కాంత, మోహసానా, వడోదరాలోని ఆఫీసులపై అధికారులు దాడులు చేశారు. 10 మందికి పైగా  ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.

అప్పటి నుంచి సింగ్ పరా రు కావడంతో ఆయనపై లుకౌట్ నో టీసులు జారీ చేశారు. ఈక్రమంలో మోహసానా జిల్లాలోని  ఫామ్‌హౌస్‌లో అతడు దాక్కున్నట్లు అధికారు లకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. నిందితుడి ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసినట్లు తెలిపారు.