calender_icon.png 20 January, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్ కింగ్స్ కోచ్‌గా పాంటింగ్

19-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాడు. రానున్న నాలుగేళ్ల పాటు పాంటింగ్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ప్రస్తుతం పంజాబ్‌కు ట్రేవర్ బేలీస్ కోచ్‌గా సేవలందిస్తుండగా.. అతడి స్థానంలో పాంటి ంగ్ బాధ్యతలు చేపడతాడని కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది.  కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాంటింగ్ సపోర్ట్ స్టాఫ్‌ను మార్చే అవకాశముంది. 2024 వరకు సుమారు ఏడు సంవత్సరాలు పాటు పాం టింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్ కమ్ కోచ్‌గా వ్యవహరించాడు. పాంటింగ్ నేతృత్వంలోనే 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మరి పంజాబ్ టైటిల్ కలను పాంటింగ్ నెరవేరుస్తాడో లేదో చూడాలి. పాంటింగ్ గతంలో ముంబై ఇండియన్స్‌కు కూడా కోచ్‌గా సేవలందించాడు.