calender_icon.png 17 March, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న పోన్నారం జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

16-03-2025 08:03:08 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 1992-93 విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులందరు ఒకచోట కలుసుకొని ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. బాల్య మిత్రులందరూ 32 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చిన్ననాటి మధురాను భూతులు, పాఠశాలలో చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్బంగా విద్యాబుద్దులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులు ముద్దం పద్మారావు, చంద్రయ్య, ప్రభాకర్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గందె రాంచందర్, ఎనగందుల రమేష్, పాడి రాయలింగు, వేల్పుల రమేష్, దారావేని రవి, సోదరి పున్నం, చీరాల శ్రీనివాస్, వేల్పుల తిరుపతి, మంద వీరేశం, విద్యార్థినులు లలిత, అరుణ, ఉదయశ్రీ లు పాల్గొన్నారు.