calender_icon.png 15 January, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రబోస్‌కు పొన్నం సత్తయ్యగౌడ్ అవార్డు

10-09-2024 04:15:08 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): పొన్నం సత్త య్యగౌడ్ 3వ స్మార క అవార్డుకు ప్రము ఖ సినీగేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, బలగం ఫేం కొమురమ్మ, మొగిలయ్య ఎంపికయ్యారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్యగౌడ్ జ్ఞాపకార్థం వారి సోదరులు, కుటుంబ సభ్యులు ఏటా రచయితలకు, కళాకారులకు పొన్నం సత్తయ్యగౌడ్ స్మారక అవార్డులను అందజేస్తున్నారు. -2024కు సోమవారం వీరిని ఎంపిక చేశారు. ఈ నెల 13న రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డులతో పాటు ఒక్కొకరికి రూ.51 వేల నగదును అందజేయనున్నారు.

పొన్నం సత్తయ్యకు నివాళులు

కరీంనగర్(విజయక్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్యగౌడ్ 14వ వర్ధంతిని కరీంనగర్‌లో సోమవారం నిర్వహించారు. పొన్నం సత్తయ్యగౌడ్ ఘాట్ మంత్రి పొ న్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నివాళులర్పించారు.