calender_icon.png 16 April, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ కు నివాళులు అర్పించిన పొనిశెట్టి వెంకటేశ్వర్లు

14-04-2025 06:32:59 PM

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ లో SC,ST పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఒక పండగ లాగ చేస్తున్న ఈ కమిటీ వారికీ బీజేపీ పార్టీ తరుపున ప్రేత్యేక కృతజ్ఞతలు తెలియచేసినారు. 

రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకోసం చేసిన మంచి పనులు ప్రజల హృదయాల్లో ఎప్పడికి నిలిచిపోతాయన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప మహనీయుడు అంబేద్కర్  అన్నారు. ఈ ప్రపంచమే మెచ్చిన గొప్ప జ్ఞాని,కుల మతాలకు అతీతంగా ప్రజలందరు ఆరాధించే  మహనీయుడని అతను చూపిన మంచి మార్గాల్లో ప్రజలందరు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు,పట్టణ ప్రధాన కార్యదర్శి మాదారపు లక్ష్మణ్, అజ్మీరా రాము,భట్టు అశోక్,బియ్యాని విజయ్, శేఖర్, సంకినేని రుద్ర,కాకటి సీతారాములు, సత్యం, రమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు